English | Telugu

ఆ ఐదు నిమిషాల‌కు స‌న్నీ ఎంత తీసుకుందో తెలుసా?

రోగ్ ఆడియో ఫంక్ష‌న్‌లో సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది స‌న్నీలియోన్‌. ఈ పోర్న్ స్టార్‌కి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్‌లో సినిమాలు చేసి, అక్క‌డా పాపులారిటీ పెంచేసుకొంది. రోగ్ ఆడియో ఫంక్ష‌న్‌కి సన్నీలియోన్ వ‌స్తోందంటే ముందు ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. అదో ప‌బ్లిసిటీ ట్రిక్కు అనుకొన్నారంతా. కానీ.. ఆమెని నిజంగానే దింపి అంద‌రికీ షాక్ ఇచ్చింది రోగ్ టీమ్. స్టేజీ మీద‌.. స‌న్నీ చిందులేసింది ఐదంటే ఐదే నిమిషాలు. అయితేనేం.. ఉన్నంత సేపూ ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఈ ఈవెంట్‌కి ఆమె ఛార్జ్ చేసిన పారితోషికం అక్ష‌రాలా రూ.35 ల‌క్ష‌లు. దాంతో పాటు ఫ్ల‌యిట్ ఛార్జీలు అద‌నం. తెలుగు సినిమా ఈవెంట్లో స‌న్నీ డాన్స్ చేయ‌డం ఇదే తొలిసారి. సన్నీ రాక‌తో... రోగ్ ఫంక్ష‌న్‌కి కాస్త కిక్ వ‌చ్చింది. ఇక మీద‌ట టాలీవుడ్‌లో ఆడియో ఫంక్ష‌న్ అన‌గానే స‌న్నీని స్టేజీ ఎక్కించ‌డానికి నిర్మాత‌లు తెగ ట్రై చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.