English | Telugu

రిలీజ్‌కి ముందే 100 కోట్లు కొట్టేసిన ప‌వ‌న్‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినా, మార్కెట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్ అభిమాన‌గ‌ణం.. అత‌ని రికార్డులే.. వాటికి నిద‌ర్శ‌నం. టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డులు కొట్ట‌గ‌ల ధీర‌త్వం.. ప‌వ‌న్ సొంతం. అందుకే ప‌వ‌న్ సినిమా వ‌స్తోందంటే.. కొత్త రికార్డుల గురించి మాట్లాడుకొంటారు. కాట‌మ‌రాయుడు విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఈ సినిమాకి జ‌రిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవ్వ‌రైనా స‌రే షాక్ అవ్వాల్సిందే. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా రూ.102 కోట్ల బిజినెస్ చేసుకొని.. నిర్మాత‌కు భారీ టేబుల్ ప్రాఫిట్‌ని మిగిల్చింది.

కాట‌మ‌రాయుడు మార్చి 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యింది. అన్ని ఏరియాలు క‌లిపి రూ.102 కోట్ల బిజినెస్ జ‌రిగింది. నైజాంలో దాదాపుగా రూ.18 కోట్ల‌కు అమ్ముడుపోయి కాట‌మ‌రాయుడు, ఓవ‌ర్సీస్‌లో రూ.12 కోట్లు ప‌లికింది. శాటిలైట్ రూపంలో మ‌రో రూ.12.5 కోట్లు వ‌చ్చాయి. అలా.. సెంచ‌రీ మార్కు దాటేసింది ఈ సినిమా. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అట్ట‌ర్ ఫ్లాప్ అయినా, ఆ సినిమా కొన్న వాళ్లు నిలువునా మునిగిపోయినా... ప‌వ‌న్ రేంజ్ త‌గ్గ‌క‌పోవ‌డం చిత్ర‌సీమ‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.