English | Telugu

మ‌హేష్‌పై వ‌ర్మ ప‌గ తీర్చుకొంటున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ‌ది ఓ డిఫ‌రెంట్ స్టైల్‌. ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేసి త‌న ప‌ని కానిచ్చుకొంటుంటాడు. లేదంటే ఏదో ఓ అంశాన్ని లేవ‌నెత్తి.. దానిపై సినిమా తీసి క్యాష్ చేసుకొంటుంటాడు. ఈసారి రాంగోపాల్ వ‌ర్మ మ‌హేష్‌బాబుని టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్‌తో ఓ సినిమా చేయాల‌ని.. వ‌ర్మ స్కెచ్ వేశాడు. అయితే అది వ‌ర్క‌వుట్ కాలేదు. వ‌ర్మ ఎన్నిసార్లు ప్ర‌య‌త్నాలు చేసినా... మ‌హేష్ స్పందించ‌లేద‌ట‌. ఇప్పుడు సంపూర్నేష్ బాబుతో పోకిరి రిట‌ర్స్ప్ అనే సినిమా చేయ‌డానికి కూడా మ‌హేష్ బాబునే కార‌ణ‌మ‌ట‌. సంపూని అడ్డు పెట్టుకొని మ‌హేష్‌పై సెటైర్లు వేసుకోవ‌చ్చ‌ని, పోకిరిని పేర‌డీ చేయొచ్చ‌ని... వ‌ర్మ భావిస్తున్నాడు. మ‌హేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ ప్రాక్టీస్ చేయ‌మ‌ని సంపూకి సూచించాడ‌ట వ‌ర్మ‌. దాన్ని బ‌ట్టి వ‌ర్మ ఎంత గొప్ప స్కెచ్ వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మ‌రి వీటిపై మ‌హేష్ గానీ, ఆయ‌న ఫ్యాన్స్‌గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.