English | Telugu

రెజీనాతో లవ్‌కి 'శుభం' కార్డు ప‌డిపోయిందా?

చిరు,ప‌వ‌న్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌.. ఇలా మెగా హీరోలు ఇంత మంది ఉన్నారుగానీ, ఎప్పుడూ సాయిధ‌ర‌మ్‌లా రూమ‌ర్ల‌లో ఇంతిలా ఇరుక్కోలేదు. సాయి రెండు మూడు సినిమాలు చేశాడో లేదో.. అత‌ని ఎఫైర్ల గురించి ఇండ్ర‌స్ట్రీలో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు. స‌రేలే... ఇది కూడా ప‌బ్లిసిటీలో ఓ భాగ‌మే అని సాయి లైట్ తీసుకొంటున్నాడు. సాయిధ‌మ‌ర్ - రెజీనాల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. ఇద్ద‌రూ క‌ల‌సి రెండు సినిమాలు చేశారు. ఆ సినిమాలు పూర్త‌య్యాక కూడా ఇద్ద‌రూ క్లోజ్ గా మూవ్ అవుతూ క‌నిపించేవార‌ట‌. ఒక‌రి బ‌ర్త్‌డే వేడుక‌ల్ని మ‌రొక‌రు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసేవార‌ట‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్యా ల‌వ్ మొద‌లైపోయింద‌ని గుస‌గుస‌లాడుకొనేవారు.

అయితే ఇప్పుడు వాళ్లే.. ఈ ప్రేమ‌కు శుభం కార్డు ప‌డిపోయింద‌ని కూడా తీర్మానించేస్తున్నారు. ఎందుకంటే రెజీనాతో వ్య‌వ‌హారం మెగా హీరోల‌కు ఎవ్వ‌రికీ న‌చ్చ‌డం లేద‌ని, అందుకే వాళ్లంతా సాయికి గ‌ట్టిగా చెప్పార‌ని, అల్లు అర‌వింద్ అయితే సాయిధ‌ర‌మ్‌కి గ‌ట్టిగా క్లాస్ తీసుకొన్నార‌ని అందుకే... బ్రేకప్ చెప్పాల్సివ‌చ్చింద‌ని టాక్‌. దాంతో పాటు ఈమ‌ధ్య సాయి మ‌రో క‌థానాయిక‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ట‌. ఇది తెలిసి రెజీనా.. తూచ్ చెప్పేసింద‌న్న‌ది మ‌రో వాద‌న‌. మొత్తానికి టాలీవుడ్‌లో ఓ ప్రేమ క‌థ మొద‌లై... అప్పుడే ఎండ్ టైటిల్స్ కూడా వేసేసుకొంద‌న్న‌మాట‌. ప్రేమ నిజ‌మో.. రూమ‌రో తెలీదు గానీ.. సాయి, రెజీనాలు మాత్రం భ‌లే పాపుల‌ర్ అయిపోయారు.