English | Telugu

స‌మంత పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్‌

స‌మంత ఓ యువ హీరోతో ల‌వ్‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. స‌మంత ల‌వ‌ర్ ఎవ‌రన్న విష‌యంలో టాలీవుడ్ లో పెద్ద క్విజ్ పోగ్రామే న‌డిచింది. ఇప్పుడు ఆ ఆన్స‌ర్ ఏంటో సినీ జ‌నాల‌కే కాదు, అందరికీ తెలిసిపోయింది. స‌మంత ఎప్పుడైతే మీడియా ముందు త‌న ప్రేమ విష‌యం బ‌య‌ట‌పెట్టిందో... అప్ప‌టి నుంచే ఆ హీరో కూడా త‌న ఇంట్లో పెళ్లి విష‌య‌మై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం మొద‌లెట్టిన‌ట్టు వినికిడి. తెలుగు చిత్ర సీమ‌లో త‌మ కుటుంబానికంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న స‌ద‌రు హీరో కుటుంబం... ముందు ఈ పెళ్లికి ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. అయితే.. ఆ హీరోగారు మాత్రం సినిమాలెవిల్లో ఛాలెంజులు చేసి, చేసుకొంటే ఆ అమ్మాయినే చేసుకొంటా.. లేదంటే లేదు.. అంటూ ఇంట్లోవాళ్ల‌తో తెగేసి చెప్పేశాడ‌ట‌.

అమ్మ త‌ర‌పునుంచి ముందే అంగీకారం అందుకొన్న అబ్బాయి.. ఇక నాన్న స‌పోర్ట్ అందుకోవాల్సివుంది. నాన్న‌గారు కూడా అతి త్వ‌ర‌లో ఓకే చెప్పేస్తార‌ని ఆ అబ్బాయి న‌మ్మ‌కం. ఈ పెళ్లికి అడ్డు ప‌డుతున్న వ్య‌క్తి.. డాడీనే. కాక‌పోతే.. ప‌రిస్థితి చేయి దాటిపోయేలా ఉంది, అనుకొని.. ఆయ‌న కూడా ఇష్టం లేక‌పోయినా ఓకే అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాంతో.. స‌మంత ల‌వ‌ర్‌లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. అందుకే... పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసేసుకొందాం.. అంటూ స‌మంత‌తో చెప్పేశాడ‌ట‌. సో... స‌మంత పెళ్లికి ఇక ఏ అడ్డూ లేన‌ట్టే అన్న‌మాట‌.