English | Telugu

త్రివిక్ర‌మ్... మ‌రీ అంత ఓవ‌ర్ ఎక్స్‌పెక్టేషన్సా?

అ.ఆ ఈస‌మ్మ‌ర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌చేందుకు రంగం సిద్దం చేసుకొంది. దాదాపుగా ఈ సినిమా రూ.60 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసి తీరుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ మార్క్‌కి చేరువైంది కూడా. రూ.30 కోట్ల బడ్జెట్‌లో తీసిన సినిమా రెట్టింపు సంపాదిస్తోంద‌న్న‌మాట‌. అంటే.. ఫైనాన్సియ‌ల్‌గా ఈ సినిమా సూప‌రో సూప‌ర్‌. కానీ త్రివిక్ర‌మ్‌కి మాత్రం ఈ అంకెలు సంతృప్తి క‌లిగించ‌డం లేద‌ని టాక్‌. ఈ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్ మ‌రీ ఎక్కువ‌గా ఆశించాడ‌ని.. క‌నీసం రూ.80 కోట్ల‌యినా చేస్తుంద‌ని క‌ల‌లుక‌న్నాడ‌ని.. అయితే ఈ సినిమా రూ.60 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోవ‌డంతో ఫీల్ అవుతున్నాడ‌ని టాక్‌. దాంతో పాటు రివ్యూలు కూడా ఆశించ‌నంత రేటింగులు ఇవ్వ‌లేద‌ని బాధ‌ప‌డుతున్నాడ‌ట‌.

మీనా న‌వ‌ల‌ను కాపీ కొట్టాడ‌న్న విష‌యంలోనూ త్రివిక్ర‌మ్ బాగా అప్ సెట్ అయ్యాడ‌ని, ఆ న‌వ‌ల హ‌క్కుల్ని అఫీషియ‌ల్‌గా తీసుకొని.. సినిమా చేస్తే, ఆ విష‌యం అర్థం చేసుకోకుండా మీడియా ఏవేవో రాసేసింద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. అందుకే.. అ.ఆ విడుద‌ల తర్వాత ఇద్దామ‌నుకొన్న మీడియా ఇంట‌ర్వ్యూల‌నూ త్రివిక్ర‌మ్ కాన్సిల్ చేశాడ‌ట‌. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. ఆ లెక్క‌న అ.ఆ త‌న స్టామినాకు మించి హిట్ట‌య్యింది. అది బ్ర‌హ్మోత్స‌వం ఎఫెక్ట్ అంటున్న‌వాళ్లూ ఉన్నారు. బ్ర‌హ్మోత్స‌వం చూసిన క‌ళ్ల‌తో అ.ఆ చూశార‌ని, అందుకే యావ‌రేజ్ గా ఉన్నా అ.ఆ విప‌రీతంగా న‌చ్చేసింద‌న్న‌ది కొంత‌మంది విమ‌ర్శ‌కుల కామెంట్‌. అయితే.. వ‌చ్చిన‌దాంతో సంతోషించ‌కుండా.. త్రివిక్ర‌మ్ అలా ఫీలైపోవ‌డం ఎందుకో మ‌రి!