Read more!

English | Telugu

సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరోయిన్లు


రాశి, కళ్యాణి, ఇంద్రజ... నిన్నటి తరం ఈ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది..

 


 


బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన రాశి హీరోయిన్‌గా మహిళా ప్రాధాన్యత వున్న చిత్రాలతో పాటు అనేక భక్తిపరమైన చిత్రాల్లోనూ నటించింది. పెళ్లి తర్వాత కొంత కాలం విరామం ప్రకటించింది. అడపాదడపా బుల్లితెరపై కనిపించింది. ఇప్పుడు లేటెస్టుగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చిత్రంలో నటించింది..

 


కళ్యాణి...  ఈ కేరళ కుట్టి శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రాల్లో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి, మెప్పించింది.
 ఈ మధ్యే రారా కృష్ణయ్య చిత్రంలో నటిస్తోంది. అన్నట్టు ఈ కుట్టి కూడా బాలనటే. హీరోయిన్‌గా దక్షిణాది భాషలన్నింటిలోను నటించింది ఈ మలయాళి నటి. ఎక్కువకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వక పోయినా, హీరోయిన్‌గా ఆమె ఇప్పుడు కనిపించే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె నటించే సినిమాల్లో పాత్రలను బట్టి కళ్యాణికిది సెకెండ్ ఇన్నింగ్స్ అని అనవచ్చు.



ఈ జాబితాలో తాజాగా చేరిన తార ఇంద్రజ. యమలీలలో  జీను ప్యాంటు వేసి అదరగొట్టిన ఈ బుల్లెమ్మ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నటుడు అజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఇందులో అజయ్ డ్యుయల్ రోల్ లోనటిస్తున్నాడు. అందులో ఒక పాత్రకు జంటగా ఇంద్రజ నటిస్తోంది. దీంతో ఇంద్రజ క్యారెక్టర్ అర్టిస్ట్ గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు.