English | Telugu

రామ్ చరణ్,శౌర్యవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!

రామ్ చరణ్,శౌర్యవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం తన 16 వ చిత్రానికి సంబంధించిన మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో చిత్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది.జాన్వీ కపూర్(Janhvi kapoor)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు సానా(Buchibabu sana)దర్శకుడు.సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.స్పోర్ట్స్ నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతు ఉంది.

ఇక ఈ మూవీ తర్వాత  'శౌర్యవ్'(Shouryuv)అనే యువ దర్శకుడితో చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.శౌర్యవ్ ఎవరో కాదు,నాచురల్ స్టార్ నాని తో 'హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు.మొదటి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.చరణ్‌ కి ఇటీవల ఒక లైన్ చెప్పాడని,అది చరణ్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'శౌర్యవ్' ఇప్పుడు ఆ కథని పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడనే కథనాలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

'హాయ్ నాన్న' శౌర్యవ్ కి తొలి సినిమా అయినా కూడా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా సెంటిమెంట్,కామెడీ,యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించాడు.అందువలనే శౌర్యవ్ కి చరణ్ ఓకే చెప్పాడని కూడా అంటున్నారు.బుచ్చిబాబు సినిమా తర్వాత చరణ్ చెయ్యబోయే సినిమాపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మరి చరణ్,శౌర్యవ్ ల సినిమాపై త్వరలోనే అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.  

 

 

రామ్ చరణ్,శౌర్యవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!