English | Telugu
అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ!!
Updated : Jun 16, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందనుంది. ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత మధ్యలో ఒక మూవీ చేసి.. ఆ తరువాత సెకండ్ పార్ట్ చేయనున్నాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ అయిపోగానే 'ఐకాన్' మూవీ పట్టాలెక్కనుంది. అయితే ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం.
దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. దీంతో అసలు ఐకాన్ మూవీ ఉంటుందా ఉండదా? అనే సందేహం అభిమానుల్లో ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇటీవల నిర్మాత బన్నీ వాసు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
పుష్ప మొదటి భాగం అయిపోగానే ఐకాన్ మూవీ పట్టాలెక్కనుంది. అయితే ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టేటస్ దృష్టిలో పెట్టుకొని.. ఇదివరకు అనుకున్న ఐకాన్ స్క్రిప్ట్ ను ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని సమాచారం.