English | Telugu
సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్!!
Updated : Jun 17, 2021
సౌత్ హీరోయిన్స్ పలువురు బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండగా.. తాజాగా సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సమాచారం.
ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్ కి దూరంగా ఉంటూనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఆమె నేచురల్ లుక్స్ కి, డ్యాన్స్ కి అందరూ ఫిదా అవుతారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి టాలెంట్ బాలీవుడ్ ను సైతం ఆకర్షించింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సాయి పల్లవిని కాంటాక్ట్ అయ్యిందని, బాలీవుడ్ కు వెళ్లడానికి ఈ బ్యూటీ కూడా సిద్ధంగానే ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరి', 'విరాట పర్వం' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే నానికి జోడిగా నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం నిర్మాణ దశలో ఉంది.