English | Telugu

భరత్ పోస్ట్‌మార్టం రిపోర్టు‌లో ఏముంది..?

మొన్న రాత్రి శంషాబాద్ ఔటర్ ‌రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం పాలయ్యాడు. రాత్రి 10 గంటలకు ప్రమాదం జరిగితే ఉదయం 10 గంటల వరకు..చనిపోయింది ఎవరో కూడా తెలియలేదు. పోలీసులు వచ్చి కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తే..అతగాడు భరత్ అని..హీరో రవితేజ తమ్ముడు అని తెలిసింది. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్నప్పటికీ..కారులో మద్యం బాటిళ్లు లభించడంతో తాగి డ్రైవ్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. భరత్‌పై గతంలో మాదక ద్రవ్యాలు, దురుసు ప్రవర్తన వంటి ఆరోపణలు ఉండటంతో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కుటుంబసభ్యులు ఎంతగా నచ్చజెప్పినా..భరత్ తీరు మారలేదు..చివరకు ఆ వైఖరే అతని ప్రాణం తీసిందని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.