English | Telugu

భరత్‌లో ఉన్న మంచి మనిషి ఎంత మందికి తెలుసు..?

ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు దుర్మరణం పాలయ్యాడు. మితీమిరిన వేగంతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని..కాదు ఓవర్‌గా డ్రింక్ చేయడంతో ముందు ఉన్నది కనిపించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఇలా రకరకాలుగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులు, ర్యాష్ డ్రైవింగ్ ఇలా ఆది నుంచీ వివాదాస్పద జీవితాన్ని గడిపిన భరత్‌లో బయటికి కనిపించని మానవతావాది ఉన్నాడు. కర్నూలు వరదల సమయంలోనూ..ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే ఉద్దేశ్యంతో తెలుగు చిత్ర పరిశ్రమ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించింది...ఇలాంటి సమయంలో భరత్ అందరికన్నా ముందుగా స్పందించి వాటిలో పాల్గొని తన వంతు సాయం చేసేవాడు. అంతేకాదు తన స్నేహితులకు కూడా ఆర్ధిక సాయాన్ని చేసినట్లు ఫిలింనగర్‌‌లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఎన్ని మంచిపనులు చేసినా..ఒక తప్పు వాటన్నింటిని దాచేస్తుందనడానికి భరత్ జీవితమే ఉదాహరణ.