English | Telugu

మరో వివాదంలో డీజే..

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా డీజే ( దువ్వాడ జగన్నాథమ్) విడుదలకు ముందే వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. గుడిలో బడిలో ఒడిలో పాటలో ఉపయోగించిన సాహిత్యం పరమ శివుణ్ణి, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి..దీనిపై రచ్చ రచ్చ జరగడం..చివరికి దర్శకుడు హరీశ్ శంకర్ తాను బ్రహ్మణుడినేని..ఒక బ్రాహ్మణుడిగా..తమ వర్గాన్ని కించపరిచే చర్యలకు ఎన్నటికి దిగనని వివరణ ఇచ్చాడు.

ఆ వివాదం ముగిసిందో లేదో..మరో వివాదాన్ని ఏరి కోరి తెచ్చుకుంది చిత్ర యూనిట్..డీజే మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఎప్పటి లాగే తన పెన్ పవర్ చూపించాడట హరీశ్ శంకర్..ముఖ్యంగా బన్నీ పలికిన పంచ్ డైలాగులకు ఆడియన్స్ ఊగిపోయారట..అయితే ఓ సీన్‌లో కమ్మ కులంపై వేసిన ఓ పంచ్..ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఝాన్సీ మేం క‌మ్మ, వాళ్లు బ్రాహ్మిణ్స్ …ఇది ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అంటోంది. వెంట‌నే బ‌న్నీ బెజ‌వాడ అంటే పైన అమ్మ‌వారు…కింద క‌మ్మ‌వారు అని చెపుతాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..దీంతో ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని చిత్ర యూనిట్ ఆందోళనగా ఉందని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.