English | Telugu
సచిన్ కు ఆయన దొరికాడంట...!
Updated : Mar 11, 2014
హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం "ఆషికీ 2". ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోగా "మౌనమేలనోయి" ఫేం సచిన్ జోషి నటించనున్నాడు. ఈ చిత్రంలో సచిన్ సరసన హీరోయిన్ గా నటించమని కాజల్ అగర్వాల్, తమన్నా వంటి టాప్ హీరోయిన్లను సంప్రదించారు. కానీ వారు ఈ సినిమాను చేయడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం ఓ కొత్త హీరోయిన్ కోసం వెతుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేరు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు రవీంద్ర ను ఓకే చేసినట్లు తెలిసింది. "బంపర్ ఆఫర్" వంటి సినిమాలను తెరకెక్కించిన రవీంద్రను, ఈ చిత్ర యూనిట్ సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నాడని తెలిసింది.
మరి సచిన్ కు హీరోయిన్ అమ్మడు ఎక్కడ దొరుకుతుందో ఏమో? ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు, రొమాన్స్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి వాటన్నిటికి ఒప్పుకునే ఆ హీరోయిన్ ఎక్కడుందో ఏమో త్వరలోనే తెలియనుంది.