English | Telugu
చరణ్ కి జోడీగా రష్మిక!?
Updated : Feb 5, 2022
`సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రైజ్` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది రష్మికా మందన్న. త్వరలో ఈ అమ్మడు నటించిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు` విడుదల కానుంది. ఇందులో మరోమారు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో దర్శనమివ్వనుంది రష్మిక.
Also Read:హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
ఇదిలా ఉంటే.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో కలిసి నటించిన రష్మికా మందన్నకి తాజాగా మరో అగ్ర కథానాయకుడు సరసన నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా `జెర్సీ` కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమాని రూపొందించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఎన్టీఆర్ సినిమా సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో చరణ్ కి జంటగా రష్మికని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కథ, పాత్ర నచ్చడంతో రష్మిక కూడా ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తోందని బజ్. త్వరలోనే చరణ్ - గౌతమ్ కాంబో మూవీలో రష్మిక ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
మరి.. అల్లు అర్జున్ కి అచ్చొచ్చిన రష్మిక.. రామ్ చరణ్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.