English | Telugu
సముద్రఖని దర్శకత్వంలో మెగా మల్టీస్టారర్!
Updated : Feb 4, 2022
మెగా హీరోలు వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'ఆచార్య'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు. అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'లో నటించాడు చరణ్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రానా దగ్గుబాటితో కలిసి 'భీమ్లా నాయక్'లో నటించాడు. ఈ మూడు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెగా మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం'ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించనున్నారని న్యూస్ వినిపిస్తోంది. తమిళంలో దర్శకుడిగా వ్యవహరించిన సముద్రఖని తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో సముద్రఖని చర్చలు జరిపారని, ఈ ప్రాజెక్ట్ కి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలో విడుదల కానున్న 'భీమ్లా నాయక్' కూడా రీమేక్ కావడం విశేషం.
ఈ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ సెట్ చేశారని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ మల్టీస్టారర్ ని నిర్మించనున్నాయని న్యూస్ వినిపిస్తోంది.