English | Telugu

ప్ర‌భాస్‌తో మారుతి 'రాజా డీలక్స్‌'?

బాహుబ‌లి ప్రాజెక్టు కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు వ‌రుస‌బెట్టి ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు ఒప్పుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే 'రాధేశ్యామ్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తోన్న ఆయ‌న‌, దాని త‌ర్వాత 'ఆదిపురుష్‌', 'స‌లార్‌', 'స్పిరిట్‌', దీపికా ప‌డుకోనేతో ఒక సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మ‌రో సినిమాకు ఆయ‌న సంత‌కం చేశాడు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తీయ‌డంతో సిద్ధ‌హ‌స్తుడైన మారుతికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్ప‌టికే ఆ సినిమా మొద‌లైంది. Also read:​'భీమ్లా నాయ‌క్' రిలీజ్‌కు జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్లేనా?

'స‌లార్' మూవీ కంటే ముందుగానే ఈ సినిమాని ప్ర‌భాస్ కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీకి 'రాజా డీల‌క్స్' అనే టైటిల్ నిర్ణ‌యించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఆ హీరోయిన్లు ఎవ‌ర‌నే విష‌యంపై క్లారిటీ రానున్న‌ది. Also read:​రామ్ కంటే బోయపాటికే ఎక్కువ పారితోషికం!?

ప్ర‌భాస్ చేస్తున్న‌, అంగీక‌రిస్తున్న సినిమాల లిస్టు చూస్తుంటే, అవి ఒక‌దానికొక‌టి పొంత‌న‌లేని జాన‌ర్‌ల సినిమాల‌ని అర్థ‌మ‌వుతోంది. పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా 'రాధేశ్యామ్‌', పౌరాణిక చిత్రంగా 'ఆదిపురుష్‌', గ్యాంగ్‌స్ట‌ర్ మూవీగా 'స‌లార్‌', సైన్స్ ఫిక్ష‌న్ సినిమాగా నాగ్ అశ్విన్ ఫిల్మ్ త‌యార‌వుతున్నాయి.