English | Telugu
గృహిణిగా రష్మిక?
Updated : Aug 7, 2021
తెలుగునాట ఇప్పటివరకు అరడజను సినిమాల్లో సందడి చేసింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. అయితే, వీటిలో ఏ చిత్రంలోనూ గృహిణిగా నటించింది లేదు. కట్ చేస్తే.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హౌస్ వైఫ్ రోల్ లో కనిపించనుందట ఈ `ఛలో` సుందరి.
ఆ వివరాల్లోకి వెళితే.. `రంగస్థలం` వంటి సెన్సేషనల్ పిరియడ్ డ్రామా తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. `పుష్ప` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తుండగా.. అతనికి జోడీగా రష్మిక కనిపించనుంది. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ.. లారీ డ్రైవర్ నుంచి డాన్ గా ఎదిగే పుష్పరాజ్ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. స్మగ్లర్ గా అతని పాత్ర ఉంటుందని కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో.. రష్మిక పాత్ర ఏమై ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పుష్ప`లో రష్మిక ఓ గృహిణి పాత్రలో దర్శనమివ్వనుందట. పుష్పరాజ్ శ్రీమతిగా రష్మిక నటన సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని టాక్. త్వరలోనే `పుష్ప`లో రష్మిక రోల్ పై క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న `పుష్ప`కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో సందడి చేయనుంది.