English | Telugu

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి!!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆచార్య' తర్వాత ఆయన లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు. ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే అవకాశంఉందని ఇటీవల వార్తలొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది.

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు ఓ రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అవుతున్నారట. ప్రభుదేవాకు రీమేక్ స్పెషలిస్ట్ గా పేరుంది. బాలీవుడ్ లో పలు రీమేక్ సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న చిరంజీవి.. ప్రభుదేవాకు ఓ రీమేక్ బాధ్యతని అప్పగించాలని చూస్తున్నారట. అయితే ఈ రీమేక్ ఏంటి? ఏ భాషకు చెందినదనేది తెలియాల్సి ఉంది.

మరి 'శంకర్ దాదా జిందాబాద్'తో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ కాంబినేషన్ ఈసారి మెప్పిస్తుందేమో చూడాలి.