English | Telugu
మెడికోగా కృతి శెట్టి?
Updated : Aug 9, 2021
మొదటి సినిమా `ఉప్పెన`తోనే సెన్సేషనల్ హిట్ అందుకుంది కృతి శెట్టి. అందులో బేబమ్మగా కుర్రకారుని ఫిదా చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన `శ్యామ్ సింగ రాయ్`, సుధీర్ బాబుకి జంటగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా పేరు నిర్ణయించని ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది కృతి.
కాగా, రామ్ సినిమాలో కృతి శెట్టి పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఆమె ఓ మెడికోగా కనిపిస్తుందట. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయిన కృతికి, పోలీస్ కమ్ డాక్టర్ అయిన రామ్ కి మధ్య సాగే లవ్ ట్రాక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని బజ్. అంతేకాదు.. `పందెం కోడి`లో మీరా జాస్మిన్ పోషించిన పాత్ర తరహాలో ఇందులోనూ కృతి రోల్ ని ఎంతో ఎనర్జిటిక్ గా డిజైన్ చేశాడట డైరెక్టర్ లింగుస్వామి. మరి.. కృతి శెట్టి పాత్రపై వస్తున్న ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`రాపో 19` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమా.. 2022 ఆరంభంలో తెరపైకి రానుంది.