English | Telugu

రంగస్థలంలో ఆ పార్టీని టార్గెట్ చేశారా..?

ఫిబ్రవరి నాటికి రావాల్సిన సినిమాలన్ని వచ్చేయడంతో.. తెలుగు ప్రేక్షకుల ఫోకస్ సమ్మర్‌పై పడింది. రామ్‌చరణ్ "రంగస్థలం, అల్లు అర్జున్ "నా పేరు సూర్య", సూపర్‌స్టార్ మహేశ్ "భరత్ అనే నేను"కి సంబంధించిన వార్తల కోసం ఇప్పుడు బ్రౌజింగ్ చేస్తున్నారు ఆడియన్స్. రెండు టీజర్లు, ఒక పాటతో రంగస్థలం ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా మారింది. ఏ నలుగురు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 1985లోకి తీసుకెళ్లి సుకుమార్ ఏం చూపించబోతున్నాడు.. చెవిటి వాడిగా చెర్రీ ఎలాంటి విన్యాసాలు చేశాడు.. సమంత-చరణ్ మధ్య కెమిస్ట్రీ ఎలా కుదిరింది అన్న దానిపైనే చర్చ.

ఇక ఫిలింనగర్‌లో తాజాగా వినిపిస్తున్న ఒక వార్త ప్రకారం.. రంగస్థలంలో రామ్‌చరణ్ చేత రాజకీయాలను కూడా చేయించాడట సుక్కు. 80ల నాటి ముఠా కక్షలు, గ్రూపు తగాదాలు, మండల, గ్రామీణ రాజకీయాలను సెల్యూలాయిడ్‌పై అద్భుతంగా తీర్చిదిద్దాడట సుకుమార్. రంగస్థలంలోని హైలెట్ పాయింట్స్‌లో ఇవి కూడా ఒకటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ఎన్నికల సీజన్.. బాబాయ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం.. పైగా 1985లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే.. ప్రస్తుతం ఒక తెలుగు రాష్ట్రంలో పవర్‌లో ఉండటంతో.. చరణ్ తన సినిమాలో ఎవరిని టార్గెట్ చేశాడోనని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.