English | Telugu

రణబీర్‌కపూర్ ఆ..టైపా..?

బాలీవుడ్ యంగ్‌హీరో..అమ్మాయిల కలల రాకుమారుడు రణ‌బీర్‌కపూర్ లిప్‌కిస్ ఇప్పడు టాక్‌ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది. మనోడు ముద్దిచ్చిందో ఏ హీరోయిన్‌కో కాదు..అది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఏంటీ ఎంగ్జయిటీ తట్టుకోలేకపోతున్నారా..చెప్పేస్తున్నాం..లే. రణ్‌బీర్ ప్రస్తుతం జగ్గా జాసూస్ మూవీలో నటిస్తున్నాడు..ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో రణ్‌బీర్, హీరోయిన్ కత్రినా కైఫ్, డైరెక్టర్ అనురాగ్ బసు పాల్గొన్నారు. ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది. సడెన్‌గా ఏం బుద్ది పుట్టిందో ఏమో..రణ్‌బీర్ పక్కనే ఉన్న దర్శకుడు అనురాగ్ బసుని పట్టుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టేశాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అన్నట్లు రణ్‌బీర్-అనురాగ్‌‌ ముద్దుల అనుబంధం ఈనాటిది కాదు..ఐదేళ్లక్రితం వీరిద్దరి కాంభినేషన్‌లో వచ్చిన బర్ఫీ ప్రమోషన్‌ ఈవెంట్‌లోనూ రణ్‌బీర్ ఇలాగే అనురాగ్‌ను స్టేజ్‌పైనే ముద్దు పెట్టేశాడు. అయితే వాళ్లిద్దరూ నిజంగా లిప్‌ లాక్ పెట్టుకున్నారా..? లేక..? అలా నటించారా అన్నది పక్కనున్న కత్రినాకే తెలియాలి. ఇదంతా తెలిసిన వారు ఇదేం పోయే కాలం అనుకుంటున్నారు.