English | Telugu

మరో వివాదంలో హరీశ్ శంకర్..?

ఇండస్ట్రీలో టైమ్‌ను కాదు టైమింగ్‌ను నమ్ముకోవాలని అదేదో సినిమాలో ఉన్న డైలాగ్‌ను టాలీవుడ్‌లో జూనియర్ ఆర్టిస్టుల దగ్గరి నుంచి స్టార్ హీరోల వరకు బాగా ఫాలో అవుతారు. ఇక్కడ ఫాలో అవ్వడమంటే పోగడటం..ఎదైనా ఆడియో రిలీజ్ ఈవెంట్‌కో..మరేదైనా వేడుకకు హాజరైతే చాలు ఫలానా హీరో సూపర్..ఫలానా హీరోయిన్ బంపర్ అని ఓ పొగిడేస్తుంటారు..తద్వారా వాళ్లపై పాజిటీవ్ ఓపినియన్ వస్తుంది..వాళ్లు బాగా ఇంప్రెస్ అయితే సినిమాలో ఛాన్స్ గ్యారెంటీ..సో అదన్నమాట ఇక్కడ లాజిక్.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే సినిమా ఆడియో వేడుకలో చాలా బాగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు హరీశ్. తనకు మొదట అవకాశాన్నిచ్చిన రవితేజ దగ్గర నుంచి బన్నీ దాకా ఓ రేంజ్‌లో పొగిడాడు..ఇక పవన్ సంగతి వేరే చెప్పాలా..అంతా బాగానే ఉంది కానీ తన దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్‌‌‌ను మరచిపోయాడు. ఈ విషయంపై జూనియర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హరీశ్‌పై దాడి మొదలెట్టేశారని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. మరి దీనిపై హరీశ్ ఎలా స్పందిస్తాడో...తారక్ ఫ్యాన్స్‌ని ఎలా సంతృప్తి పరుస్తాడో వేచి చూడాలి.