English | Telugu

దిల్‌రాజు కోసం క్లైమాక్స్‌లో కామెడీ చేసిన బన్నీ..!

దిల్‌రాజు..టాలీవుడ్‌లో నిర్మాత స్థాయిని పెంచిన వ్యక్తి. హీరోనో లేదా దర్శకుడిని చూసి సినిమాలకు వెళ్లే సగటు ప్రేక్షకుడిని తన పేరుని..బ్యానర్‌ని చూసి ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే అన్నంతగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. ఎవరు ఎక్కడ పడతారో..ఏ సీన్‌ ఎలా కనెక్ట్ చేయాలో తెలిసిన నేర్పరి. అందుకే దిల్‌రాజు సినిమాలు బాక్సాఫీసు దగ్గర హిట్టు కొడతాయి. ఎంత పెద్ద డైరెక్టర్‌తో పనిచేసినా..స్టార్ హీరో ఆ సినిమాలో హీరో అయినా కథ, స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్‌లో దిల్‌రాజు ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా ఉంటుంది.

తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే విషయంలోనూ దిల్‌రాజు చాలా మార్పులు, చేర్పులు సూచించారట. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో రాజుగారి హ్యాండ్ బాగా పడిందట. నిజానికి క్లైమాక్స్ భారీగా ప్లాన్ చేశాడట హరీశ్ అయితే ప్రీ క్లైమాక్స్‌లో ఓ భారీ ఫైట్ ఉందట. వెంట వెంటనే రెండు ఫైట్స్ అంటే ఆడియన్స్ బోర్ ఫీలవుతాడని భావించిన దిల్‌రాజు క్లైమాక్స్‌ని మార్చేయమన్నాడట. అందుకే క్లైమాక్స్‌లో ఫైట్ లేకుండా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టి..జనాల్ని నవ్వించాలని ప్లాన్ చేశాడట హరీశ్..మరి రాజుగారి ప్లాన్ వర్కవుట్ అయ్యింది లేనిది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.