English | Telugu

విలన్ గా దగ్గుబాటి రానా

విలన్ గా దగ్గుబాటి రానా నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మూవీ మొగల్ డాక్టర్ రామానాయుడు గారి మనవడు, సురేష్ బాబు కుమారుడు, విక్టరీ వెంకటేష్ కి అన్నకొడుకు అయిన యువ హీరో రానా "లీడర్" చిత్రంతో హీరోగా తెలుగు సినీరంగప్రవేశం చేశాడు. తన రెండవ చిత్రాన్ని హిందీలో "దమ్ మారో దమ్" గా నటించాడు. మళ్ళీ మూడవ చిత్రంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న "నేను - నా రాక్షసి" చిత్రంలో నటిస్తున్నారు. ఈ "నేను - నా రాక్షసి" చిత్రం ఏప్రెల్ 29 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత రానా ఏ సినిమాలో నటించబోతున్నాడు.?

ఎంత వరకూ నిజమో కానీ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం రానా ఒక హిందీ చిత్రంలో విలన్ గా నటించటానికి అంగీకరించారని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా, రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "క్రిష్-2" చిత్రంలో మన రానా విలన్ గా నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ లను అడిగితే వారు అంగీకరించకపోవటం వల్ల ఈ విలన్ పాత్ర రానాని వరించిందని అనుకుంటున్నారు. ఈ విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ పాత్రని తెలిసింది.