English | Telugu
'ఎవడు'కి దిల్ మార్కు దూరం
Updated : Jul 2, 2013
చిత్ర కథ, బడ్జెట్ విషయంలోనే కాకుండా తాను నిర్మించే ప్రతి చిత్రానికి సంబంధించిన ఫంక్షన్ లను చాలా కొత్తగా, అభిమానులందరూ కూడా ఎక్కడ కూడా బోర్ ఫీలవ్వకుండా ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేవాడు నిర్మాత దిల్ రాజు. అయితే దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "ఎవడు".
రామ్ చరణ్, శృతిహాసన్, అమీ జాక్సన్ కలిసి నటించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న (జూలై 01) శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా జనాలకు ఎంజాయ్ చెయ్యలేని చెత్త డాన్సులతో షో ప్రారంభించారు. అదే విధంగా వేణుమాధవ్ ఓవరాక్షన్ మరి ఎక్కువైపోయింది. అసలే పవన్ కళ్యాణ్ రాలేకపోవడంతో నిరాశకు గురైన అభిమానులు... కార్యక్రమం ఇలా చప్పగా ఉండేసరికి "ఎవడు"కి రెస్పాన్స్ తగ్గిపోయింది. అదే విధంగా రామ్ చరణ్, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కాబట్టి... ఈ ఆడియో వేడుకలో దేవి తన డాన్సులతో, పాటలతో అలరిస్తాడని అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
అయితే ప్రతి ఆడియో వేడుక కూడా అదరగొట్టే విధంగా ప్లాన్ చేసే దిల్ రాజు ఈసారి ఇలా చల్లబడటానికి గల కారణమేంటి? మెగా ఫ్యామిలీ దిల్ రాజుకు ఏమైనా ఆంక్షలు పెట్టారా? లేక చిరు వస్తున్నాడు కదా.. ప్రోగ్రాం సైలెంట్ గా కానిచ్చేద్దాం అని అనుకున్నాడా? ఏమో ... ఎవరికి తెలుసు?