English | Telugu
చెర్రీ.. ఏంటమ్మా ఇది ?
Updated : Jun 27, 2013
క్షణికావేశంలో తప్పులు చేయడం మానవసహజం. అయితే చేసిన తప్పుల్ని హుందాగా ఒప్పుకొని.. ఆ తప్పు రేంజ్‌నుబట్టి.. సింపుల్‌గా సారీ చెప్పడమో. లేక మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడమో చేసేవాళ్లు ఉత్తములవుతారు. అలా కాకుండా చేసిన తప్పుని కప్పిబుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్లు ఎదుటివాళ్ల ముందు చులకన అవుతారు. రామ్‌చరణ్ ఉందంతం ఇందుకు తాజా ఉదాహరణ. తొలి చిత్రం కూడా విడుదల కాకముందు నుంచి మెగాపవర్‌స్టార్ అని పిలిపించుకుంటున్న రామ్‌చరణ్ ఆ మధ్య పట్టపగలు రోడ్డుపై "రచ్చ" చేయడం తెలిసిందే.
కేంద్ర టూరిజం మినిస్టర్‌గా ఉన్న తన తండ్రి చిరంజీవి సెక్యూరిటి కోసం ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ సిబ్బందిని ఆగమేఘాలపై ఘటనా స్థలానికి రప్పించి.. బాధితులపై దాడి చేయించిన రామ్‌చరణ్.. ఆ విషయమై కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో తాను లేనే లేనని.. కానీ తాను ఉన్నట్లుగా ఫోటోలను మార్ఫింగ్ చేసారని రామ్‌చరణ్ చెప్పింది అబద్ధమని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ సమయంలో ఫోటోలు తీసిన ఫోటో జర్నలిస్ట్.. ఫోటోలు మార్ఫింగ్ చేసి, తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసాడని సైతం రామ్‌చరణ్ ఆరోపించడం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆరోపణ కూడా పచ్చి అబద్ధమని తేలిపోవడంతో రామ్‌చరణ్ వ్యక్తిత్వాన్ని అందరూ శంకించాల్సి వస్తోంది. దీనికి ముందు కూడా రామ్‌చరణ్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పెద్దాయన అని కూడా చూడకుండా దాసరిని డీకొనడం, "మీడియా అంటె వెంట్రుకతో సమానం" అనడం రామ్‌చరణ్ అపరిపక్వతకు అద్దం పడుతున్నాయి.
కొసమెరుపు:
ఘటనా స్థలంలో రామ్‌చరణ్ ఉన్నారంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు పోలీసులు నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వచ్చినరోజే.. ఆఘమేఘాలపై "ఎవడు" లేటస్ట్ స్టిల్స్ విడుదల చేయడం.. అడియో విడుదల తేది (జూన్ ౩౦) అనౌన్స్ చేయడంతోపాటు.. స్పెషల్‌గా ఆడియో బైట్స్ కూడా వీడియో రూపంలో రిలీజ్ చేసారు!