English | Telugu
పవన్ పార్టీపై వర్మ కన్ను
Updated : Mar 18, 2014
గతంలో ముంబాయిలో బాంబు పేలుళ్లు జరిగితే వాటి మీద ఒక సినిమా, పరిటాల హత్య నేపథ్యంలో ఇంకొక సినిమా, బెజవాడ రౌడీయిజం గురించి తెలపడానికి మరొక సినిమా... ఇలా ఏదైనా వాస్తవ సంఘటనల నేపధ్యంలో ఎక్కువగా సినిమాలు తీసే వర్మ కన్ను ప్రస్తుతం పవన్ పై పడింది.
అయితే గతకొంత కాలంగా "పవన్ రాజకీయాల్లోకి రావాలని, వస్తే బాగుంటుంది" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. కానీ పవన్ రాజకీయాల్లోకి వచ్చేసాడు. "జనసేన" పార్టీ కూడా పెట్టేశాడు. పవన్ కి ఓటు వేయకపోతే మనుషులే కాదు అంటూ వర్మ తాజాగా తన ట్విట్టర్ ద్వారా పవన్ "జనసేన" పార్టీ గురించి ప్రచారం మొదలుపెట్టాడు. త్వరలోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన విధానాన్ని ఒక సినిమా రూపంలో తెరకెక్కించాలని వర్మ ఆలోచిస్తున్నాడు. ఇందుకోసం కథ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. వర్మ ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణులతో "రౌడీ", రాజశేఖర్ తో "పట్టపగలు" తెరకెక్కిస్తున్నాడు. అదే విధంగా విష్ణుతో "టెన్షన్ టెన్షన్" అనే సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్రాలన్ని కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే పవన్ రాజకీయ నేపథ్యంగా కూడా సినిమా మొదలుపెట్టబోతున్నాడని సమాచారం.