English | Telugu
శ్రుతి మాటంటే.. చెర్రీకి ఎంత గురో..??
Updated : Jan 21, 2016
ఈమధ్య రీమేక్ సినిమాలపై దృష్టి నిలిపాడు రామ్‌చరణ్. కొత్త కథలు ఎంచుకొని ప్రయోగాలు చేయడం కంటే, ఓచోట ఆడిన సినిమాల్ని రీమేక్ చేసుకోవడం మేలన్న ఆలోచనలో ఉన్నాడు. తని ఒరువన్‌ని రీమేక్ చేస్తున్న చెర్రీ.. ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీపై దృష్టి పెట్టాడు. అదే... రాకీ హ్యాండ్సమ్. జాన్ అబ్రహాం నటిస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా గురించి చరణ్ దగ్గర గొప్పగా చెప్పిందట శ్రుతి. చాలా మంచి సినిమా అది.. వీలుంటే.. రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించండి.. అని హింట్ ఇచ్చిందట. శ్రుతి మాట పై నమ్మకంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ గురించి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడట చెర్రీ. రిలీజ్ అయ్యాక చూద్దామనుకొంటే ఎవరైనా ఎగరేసుకుపోతారేమో అని ముందే కర్చీఫ్ సిద్ధం చేసుకొంటున్నాడట. శ్రుతి మాటంటే.. చెర్రీకి ఎంత గురో..