English | Telugu
బాలయ్య ఫ్యాన్.. ఇంత పిరికోడా??
Updated : Jan 21, 2016
జై బాలయ్య అంటూ... రంగంలోకి దిగుతున్నాడు నాని. ఆయన కొత్త సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో... నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించబోతున్నాడు. బాలయ్య అభిమాని అంటే ఎలా ఉండాలి? వీరత్వం, పౌరుషం.. ఆ డైలాగులూ అదిరిపోవాలి. అందరూ ఇలానే ఉంటుందేమో అని అనుకొంటారు. కానీ.. అందుకు వైవిధ్యంగా ట్రైలర్ కట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాని. కృష్ణగాడి వీర ప్రేమగాథ ట్రైలర్... ఇప్పుడు ఆన్ లైన్‌లో సందడి చేస్తోంది. ఇందులో నాని ఓ పిరికివాడిగా కనిపించబోతున్నాడు. అంటే టైటిల్ లో ఉన్న వీరత్వం.. నాని పాత్రలో లేదన్నమాట.
ఓ పిరికివాడు బలవంతమైన ఓ ముఠాని ఎదుర్కొని ప్రేమలో ఎలా గెలిచాడన్నదే ఈ సినిమాకాన్సెప్ట్. అన్నట్టు ఈ సినిమాకి అంతకు ముందు జై బాలయ్య అనే పేరు పెడదామనుకొన్నారు. అయితే ఆ ఆలోచన నుంచి చిత్రబృందం విరమించుకొంది. కనీసం ట్రైలర్‌లో ఒక్కసారి కూడా బాలయ్య ప్రస్తావనే లేకపోవడం కొసమెరుపు.