English | Telugu

ఊహించని కాంబోలో రామ్ చరణ్ మూవీ.. సుకుమార్ కంటే ముందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవల లాంచ్ అయిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మరో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్లు అన్బ‌రివ్‌(అన్బుమణి మరియు అరివుమణి) దర్శకులుగా పరిచయం కానున్నారని సమాచారం.

తమిళనాడుకి చెందిన అన్బ‌రివ్‌ కవల సోదరులు. వీరి ఎన్నో సినిమాలకు యాక్ష‌న్ కొరియోగ్రఫీ చేశారు. వాటిలో 'కేజీఎఫ్', 'విక్రమ్', 'దసరా', 'లియో', 'సలార్' వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే 'కల్కి 2898 AD', 'ఇండియన్-2', 'గేమ్ ఛేంజర్' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. ఎప్పటినుంచో దర్శకులుగా మారాలని చూస్తున్న ఈ సోదరులు.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి ఓ కథ వినిపించారట. వారు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చరణ్.. వారి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం అన్బ‌రివ్‌ ద్వయం కథకి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. సుకుమార్ ప్రాజెక్ట్ కి ముందో వెనకో.. రామ్ చరణ్ ఖచ్చితంగా ఈ సినిమా చేసే అవకాశముందని ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.