Read more!

English | Telugu

రామ్ చరణ్ సినిమలో మరో హీరో


 
 
మెగాహీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం గురించి ఇప్పుడు లేటెస్టుగా ఇంకో విషయం ఫిలింనగర్‌లో షికార్లు చేస్తోంది. లెజెండ్ సినిమాతో కొత్త ఇమేజ్ సెట్ చేసుకున్న జగపతిబాబు ఈ సినిమాలో నటింటబోతున్నాడని టాకు మొదలైంది. జగపతిబాబు ఇప్పటికే ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూట్, రిషూట్ పాత్రల బదాలయింపుతో నిర్మాత బండ్ల గణేష్ మీద చాలా భారం పడింది. తాజాగా జగపతిబాబు ఎంట్రీతో సినిమాకు ప్లస్ అయినా బడ్జెట్ మాత్రం మరింత పెరుగుతుంది. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.