English | Telugu
రామ్ చరణ్ సరసన హన్సిక
Updated : Jan 10, 2012
రామ్ చరణ్ సరసన హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రంలో హీరో రామ్ రణ్ తేజ సరసన హీరోయిన్ గా, "దేశముదురు" ముంబాయి భామ హన్సిక మోత్వానీ నటించనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ సినిమాకి రామ్ చరణ్ తల్లి శ్రీమతి సురేఖ క్లాప్ కొట్టారు. ఈ సినిమాకి సంబంధించిన కథను ప్రముఖ సినీ కథారచయిత ఆకుల శివ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "రచ్చ" చిత్రం పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంటుంది.