English | Telugu
ఈమె అక్కడ కూడా సెగలు పుట్టిస్తుందా ?
Updated : Mar 26, 2014
బీజేపీకి తాను కూతురులాంటిదాన్నని చెప్పిన బాలీవుడ్ ఐటంగర్ల్ రాఖీసావంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తుంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను బిజెపి తరపున పోటీ చేస్తాను. అయితే ఒకవేళ ఆ పార్టీ ఈ అమ్మడికి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటుంది. మరో రెండు రోజుల్లో తన కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నుండి ఐటెం పాటలలో నటించనని, మంచి పాత్రలు మాత్రమే చేస్తానని అంటుంది రాఖీ.
ఈ అమ్మడి మాటలకు అక్కడి ప్రజలు గొల్లున నవ్వుతున్నారు. నువ్వు రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తావు తల్లి. అక్కడ ఎవరైనా నీకు మద్దతు తెలుపకపోతే వారి ముందు నీ అందాల ప్రదర్శన చేసి, వారిని పిచ్చోళ్లని చేస్తావా ఏంటి? సినిమాల్లో ఐటెం పాటలు మానేసి లోక్ సభలో హాట్ హాట్ గా ఐటెం ప్రసంగాలు చేస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.