English | Telugu
జూన్ 14 న రజనీ చెన్నైకి రాక
Updated : Jun 11, 2011
జూన్ 14 న రజనీ సింగపూర్ నుండి చెన్నైకి రాబోతున్నారని ఆయన పెద్దల్లుడు, ప్రముఖ తమిళ యువ హీరో ధనుష్ మీడియాకి తెలిపారు. సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించాల్సిన భారీ బడ్జెట్ త్రిభాషా చిత్రం "రాణా" నాలుగు నెలల పాటు వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రజనీకాంత్ "రాణా" ప్రారంభమైన రోజునే ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఒకే నెలలో మూడుసార్లు ఆయన హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హీరో రజనీకాంత్ సింగపూర్ లో హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు.
రజనీకాంత్ పూర్తిగా కోలుకుని తిరిగి పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించే శక్తి రావటానికి సుమారు నాలుగు నెలలు సమయం పడుతుందని తెలిసింది. రజనీకాంత్ "రాణా" సినిమాలో దీపిక పదుకునే, ఇలియానా డి క్రూజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ రజనీకాంత్ "రాణా" సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ని ఎమ్మీ అవార్డ్ విన్నర్ చార్లెస్ డార్బీ పర్యవేక్షణలో అందిస్తారు. రజనీకాంత్ సింగపూర్ నుండి జూన్ 14 వ తేదీన చెన్నైకి రానున్నారనీ, ఆయన చాలా త్వరగా కోలుకుంటున్నారనీ ఆయన అల్లుడు ధనుష్ మీడియాకు తెలియజేశారు.