English | Telugu
రజనీకాంత్ రోబో 2.0 స్టొరీ లీకైంది..!!
Updated : Dec 30, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకేక్కబోతున్న రోబో 2 పై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమాని శంకర్ ఎలాంటి కథతో తీస్తున్నాడు..రోబోని మించిన విన్యాసాలు ఇందులో వుంటాయా? అనే వాటిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల టాక్ ప్రకార౦..రోబో -2 కథ లీకైందట. లీక్ అయిన స్టొరీ కూడా కొంచెం ఆసక్తికరంగానే వుంది. ఆ కథ ఏమిటంటే...
రోబో -2 లో రజినీకాంత్ వశీకరణ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో అన్నిటికంటే పవర్ ఫుల్ రోబో అక్షయ్ కుమార్ ని తయారుచేస్తాడట. అయితే అతను వశీకరణ్ మాట వినకుండా విలన్ ల పక్కన చెరి దేశనాశనం కోసం పనిచేస్తాడట. అప్పుడు అక్షయ్ ఎలాగైనా ఎదుర్కొనేందుకు వశీకరణ్ మళ్ళీ చిట్టీని రంగంలోకి దింపుతాడట. మునుపటి కంటే చిట్టీని అడ్వాన్స్ డ్ టెక్నాలజీ తో రీ మోడిఫై చేస్తాడట వశీకరణ్. దాంతో చిట్టీ అక్షయ్ కుమార్ ఎలా అడ్డుకుంది. విలన్ గ్యాంగ్ ఆట ఎలా కట్టించింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా వుండబోతుందట.
మరోవైపు అక్షయ్, చిట్టీల మధ్య పోరాట సన్నివేశాలు అసాధారణ రీతిలో ప్లాన్ చేశాడట శంకర్. ఈ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయట. ఈ సన్నివేశాల కోసం భారీ రేంజులో డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారట. సో ఈ సారి చిట్టీకి గట్టి పనే పడింది.