English | Telugu
నాగశౌర్యకు ము.. ము.. ముద్దంటే చేదా?
Updated : Dec 27, 2015
సినిమా వాళ్ళకు సెంటిమెంట్లు ఎక్కువ. అయితే ఆ సెంటిమెంట్లు ధైర్యంగా ముందడుగు వేయడానికి పనికివస్తే మంచిదే కానీ, వెనక్కి లాగే తలాతోకా లేని సెంటిమెంట్లని చూస్తేనే మా సెడ్డ సిరాకేస్తది. ఇప్పుడు యంగ్ హీరో నాగశౌర్య ఎక్స్‌ప్రెస్ చేసిన ఒక పరమ సిల్లీ సెంటిమెంట్ కూడా అలాంటిదే మరి! ఈ కుర్ర హీరో చూడ్డానికి అందంగానే వుంటాడుగానీ, మాట్లాడే విషయంలోనే చాలా వీక్‌లాగా వున్నాడే అని జనం అనుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, నాగశౌర్య నటించిన రమేష్ వర్మ సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. మనోడికి యూత్‌లో వున్న గుర్తింపుతోపాటు ఇళయరాజా సంగీతం, దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాని జనం ముందు ప్రొజెక్ట్ చేసిన తీరు ఈ మూవీకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ మన యువ హీరోకి క్రేజీనెస్ తెచ్చిందేమో, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో క్రేజీ కామెంట్లు చేసేశాడు. ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో అసలు కిస్సులు, లిప్పులాక్కులు లేవట... మరి పోస్టర్లలో, ట్రైలర్లలో కనిపిస్తు్న్న కిస్సుల గురించి ఏంటయ్యా అని అడిగితే, పబ్లిసిటీలో కనిపిస్తున్న కిస్ సీన్లన్నీ తాను నిజంగా పెట్టిన కిస్సులు కాదని, దర్శకుడు రమేష్ వర్మ ట్రిక్కులని కిసుక్కున అనేశాడు. అసలు తాను తన సినిమాల్లో కిస్సులే ఇవ్వదలుచుకోవడం లేదని, ఎందుకంటే గతంలో తాను కిస్సులు పెట్టిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయని, అందుకే ఇకముందు కిస్సులు ఇవ్వదలుచుకోవడంలేదని పుసుక్కున అనేశాడు. సెన్సారు వారి సమాచారం ఏంటంటే, ఈ సినిమాలో రెండు మూడు మాంఛి కిస్సులు వున్నాయట. ఆ కిస్సులు కూడా ఎలాంటి ఇబ్బందీ కలిగించని విధంగా క్లాస్‌గా వున్నాయట. మరి సినిమాలో అలాంటి క్లాస్ కిస్సులు పెట్టుకుని మనోడు ఈ సినిమాలో అసలు కిస్సులే లేవని ఎందుకు అంటున్నాడో అని టాలీవుడ్ జనాలు కిస్సుక్కుమని నవ్వుకుంటున్నారు. అయినా కుర్ర హీరో చాదస్తం గానీ, కిస్సులు పెడితే సినిమా ఫ్లాప్ కావడమేంటి? ఈయన చెప్పేదానికి ఏమైనా అర్థంపర్థం వుందా అని టాలీవుడ్‌లో అనుకుంటున్నారు. కిస్సుల వల్ల క్రేజ్ పెంచుకున్న ‘గీతాంజలి’, ‘ప్రేమ’ లాంటి బోలెడన్ని సినిమాల లిస్టుని గుర్తు చేసుకుంటున్నారు. అయినా సినిమా హిట్ కావడానికైనా, ఫ్లాప్ కావడానికైనా కథ దగ్గర్నుంచి ఎన్నో అంశాలు కారణం అవుతాయి. కేవలం తాను కిస్సులు పెట్టడం వల్లే సినిమాలు ఫ్లాపయ్యాయని నాగశౌర్య లాంటి ఈ జనరేషన్ కుర్రాడు అనుకోవడమే మరీ ఎటకారంగా వుందనీ, నాగశౌర్యా కాస్త డెవలప్ అవ్వమ్మా అనీ అంటున్నారు. చాలామంది కుర్రహీరోలు తమ సినిమాల్లో కిస్సు సీన్లు వుంటే బావుండని అనుకుంటూ వుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం దొరకదు. మరి నాగశౌర్యకి ఆ అవకాశం దొరుకుతున్నా బెట్టు చేస్తున్నాడెందుకో మరి! ఇంతకీ ఇతగాడికి ము.. ము.. ముద్దంటే చేదు అని అనుకోవాలా.. లేక ప్రవరాఖ్యుడిలా పోజులు కొడుతున్నాడని అనుకోవాలా?