English | Telugu
రామానాయుడుకే నో చెప్పిన రాజమౌళి
Updated : Apr 7, 2011
రామానాయుడుకే నో చెప్పిన రాజమౌళి అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత, మూవీమొగల్ గా, చలనచిత్ర చక్రవర్తిగా పేరొంది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అత్యధిక చలన చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు అడిగితే సినిమా చేయననే మొనగాడెవరన్నా ఉన్నాడా...? అంటే ఉన్నాడనే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విషయమేమిటంటే రామానాయుడు గారు విశ్వవిఖ్యాతనవరసనటనా సార్వభౌమ, నటరన డాక్టర్ యన్.టి.రామారావు హీరోగా ద్విపాత్రాభినయం చేయగా, జమున, యల్.విజయలక్ష్మీ హీరోయిన్లుగా నటించగా రామానాయుడు గారు నిర్మించిన తొలి చిత్రం "రాముడు-భీముడు"ని మళ్ళీ యన్ టి ఆర్ మనవడు జూనియర్ యన్ టి ఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తే నిర్మించాలని నాయుడుగారి ఉద్దేశం.
ఆ చిత్రాన్ని రిమేక్ చేయమని అపజయమెరుగని యువ దర్శకుడు యస్ యస్ రాజమౌళిని కోరగా అందుకాయన "నో" అన్నట్టు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. కారణమేమిటంటే పాత చిత్రాల జోలికిపోయి వాటి ఫ్లేవర్ ని దెబ్బతీయటం రాజమౌళికి ఏమాత్రం ఇష్టం లేదనీ, అందుకే "రాముడు- భీముడు" చిత్రాన్ని రీమేక్ చేయటానికి ఆయన నిరాకరించినట్లు ఆయన సన్నిహితులంటున్నారు.