Read more!

English | Telugu

బాపు బొమ్మకు 'లెజెండ్' భామ చెక్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణీతను ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆమె స్థానంలో రాధిక ఆంప్టే ను ఎంపిక చేసారని తాజా సమాచారం. ప్రణీతే ఈ సినిమా నుంచి తప్పుకుందా? లేక యూనిట్ ఆమెను తొలిగించి రాధిక ఆప్టేను తీసుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు లెజెంట్ హిట్ సెంటిమెంట్ కూడా ఇక్కడ కలిసివస్తుందని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అయితే బాలకృష్ణతో కలిసి 'లెజెండ్' చిత్రంలో నటించిన రాధిక ఆప్టేకు రెండోసారి బాలయ్యతో నటించే అవకాశం దక్కడం విశేషం.