English | Telugu

రభసకు ఎన్టీఆర్ బ్రేకులు వేయబోతున్నడా...?

 

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రభస". గతకొద్దికాలంగా ఈ చిత్ర షూటింగ్ కు పలు అడ్డంకులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దర్శకుడి అనారోగ్యం కారణంగా ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ రెండుసార్లు వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రారంభం అయిన షూటింగ్ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ గతంలో ప్రచారం చేసాడు. అయితే తాజా ఎన్నికల కోసం కూడా ఎన్టీఆర్ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడని తెలిసింది. దీనికోసం దాదాపు 20రోజుల డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం. కానీ "రభస" షూటింగ్ పూర్తిచేసాక ప్రచారం చేస్తాడ లేక షూటింగ్ ఆపేసి ప్రచారంలో పాల్గొంటాడ అనే విషయం త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా కూడా ఒకవైపు తమ అభిమాన నటుడు తమ ముందుకు కలవడానికి వస్తున్నాడని ఆనందపడుతున్న.. మరోవైపు "రభస" సినిమా ఆగిపోతుందనే నిరాశలో ఉన్నారు అభిమానులు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో త్వరలోనే తెలియనుంది.