English | Telugu
ఏప్రిల్ 20న ఎన్టీఆర్ పూరి సినిమా
Updated : Apr 8, 2014
"హార్ట్ ఎటాక్" చిత్రం ఘనవిజయంతో ఫుల్ జోష్ లో ఉన్న పూరీ.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తున్నాడు. అసలే "రామయ్య వస్తావయ్యా" సినిమా అనుకోని ఘోర పరాజయం కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న "రభస" చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం పూరీ సినిమానే నమ్ముకున్నాడు. "ఆంధ్రావాలా" వంటి ఫ్లాప్ రీపీట్ కాకుండా పూరీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఈనెల 20న ప్రారంభించబోతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం చిత్ర సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపికలో పూరి బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.