English | Telugu
మెగాస్టార్ మూవీలో గద్దర్!!
Updated : Aug 29, 2021
మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రజాగాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
'గాడ్ ఫాదర్' సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం దర్శక నిర్మాతలు గద్ధర్ ని సంప్రదించారని తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాబోయే షెడ్యూల్ లో వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్ధర్ పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అలాగే బాబీ, మెహర్ రమేష్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.