English | Telugu

ఆ బావబామ్మర్ధులు సరే..? ఈ బావబామ్మర్థుల్లో పైచేయి ఎవరిది..?

ఈ ఏడాది మెగా హీరోల్లో నలుగురు బావబామ్మర్దులు బాక్సాఫీస్ వేదికగా సమరానికి సై అంటున్నారు. మొదటగా వరుణ్‌తేజ్-సాయిథరమ్‌ తేజ్‌ల మధ్య జరిగిన పోటీలో.. రోటీన్ కమర్షియల్ ఫార్ములాతో సాయి బోల్తాకొట్టగా.. కూల్ లవ్‌స్టోరీతో మరోసారి ఆడియన్స్‌ని ఫిదా చేసి.. సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుని బావపై గెలిచాడు వరుణ్. ఇక నెక్ట్స్ అందరూ ఎదురుచూస్తోన్న మరో బావబామ్మర్ధుల సమరం అల్లు అర్జున్-రామ్‌చరణ్‌లది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది తేల్చడం కష్టమే.. ఇద్దరి సబ్జెక్ట్‌లు దేనికదే ప్రత్యేకం.. ఇద్దరు ఎక్కడా తగ్గకుండా..? సినిమాలు చేస్తున్నారు. టీజర్లతో రెండు సినిమాలు టాలీవుడ్‌లో అంచనాలు పెంచాయి.

ఇప్పటికైతే సుకుమార్ టేకింగ్, పాటలు రంగస్థలాన్ని ఒక మెట్టు పైన ఉంచాయని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి. మార్చి 30 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రతి సినిమాకు కష్టపడే బన్నీ నా పేరు సూర్య కోసం కూడా అంతే కష్టపడుతున్నాడు. లుక్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. రియల్ లోకేషన్స్‌లో.. ఎముకలు కొరికే చలిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సమ్మర్ ఇంత వరకు బన్నీని డిజప్పాయింట్ చేయలేదు. అదే సెంటిమెంట్ ఇప్పుడు పనిచేయవచ్చని అల్లు అర్జున్ అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఏప్రిల్ 26న నా పేరు సూర్య వరల్డ్ వైడ్‌గా రిలీజవుతోంది. మరి ఈ బావబామ్మర్థుల పోటీలో విజేత ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.