English | Telugu
ప్రభాస్ తో `మాస్టర్` బ్యూటీ!?
Updated : Feb 16, 2022
`రాధే శ్యామ్`, `ఆది పురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్`.. ఇలా క్రేజీ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కాగా, ఈ స్టార్ హీరో లైనప్ లో మరో చిత్రం చేరబోతోందని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. `ఆర్ ఆర్ ఆర్` నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి `రాజా డీలక్స్` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని బజ్.
ఇదిలా ఉంటే.. `రాజా డీలక్స్`లో ప్రభాస్ సరసన ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారట. మెయిన్ లీడ్ గా `మాస్టర్` బ్యూటీ మాళవికా మోహనన్ ని ఎంపిక చేశారని టాక్. అలాగే మరో నాయికగా `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీ లీల నటించే అవకాశముందని వినిపిస్తోంది. ఇక మూడో నాయిక ఎవరన్న విషయంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే `రాజా డీలక్స్`కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
Also Read:ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహిరి ఇకలేరు
కాగా, ప్రభాస్ తాజా చిత్రం `రాధే శ్యామ్` మార్చి 11న థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే, మారుతి రూపొందిస్తున్న `పక్కా కమర్షియల్` వేసవి కానుకగా మే 20న రిలీజ్ కానుంది.