English | Telugu
బాలయ్యతో మరోసారి మీరా జాస్మిన్!?
Updated : Feb 16, 2022
నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో మీరా జాస్మిన్ ఒకరు. 2007లో విడుదలైన `మహారథి` కోసం ఈ ఇద్దరు తొలిసారిగా జట్టుకట్టారు. కట్ చేస్తే.. 15 ఏళ్ళ తరువాత మరోసారి రొమాన్స్ చేయబోతున్నారని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వబోతున్నారట బాలయ్య. అంతేకాదు.. ఇందులో బాలకృష్ణ కూతురి పాత్రలో `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీ లీల కనిపిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా మీరా జాస్మిన్ ని ఎంపికచేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలో మీరా జాస్మిన్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `మహారథి`తో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన బాలయ్య - మీరా జోడీ.. ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.
ఇదిలా ఉంటే, తాజాగా 40వ పుట్టినరోజు జరుపుకున్న మీరా జాస్మిన్.. ప్రస్తుతం మలయాళంలో `మకల్` అనే సినిమాలో నటిస్తోంది.