English | Telugu

బాహుబలికి గాయాలు... విశ్రాంతిలో ప్రభాస్

 

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ భుజానికి గాయమయ్యిందని తెలిసింది. దాంతో వెంటనే ప్రభాస్ కు 45రోజుల వరకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని సమాచారం. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుందనుకున్న రాజమౌళి... ప్రభాస్ కోలుకునే వరకు మిగతా సన్నివేశాలను చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే మళ్ళీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసిందే. ఇందులో ప్రభాస్ లేని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించనున్నారు.

భారీ బడ్జెట్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ యుద్దపోరాటాలు ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే చిత్ర నటీనటులు కత్తిసాము, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నారు. ఎంతో కష్టమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ లను చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాను 2015లో విడుదల చేయనున్నారు.