English | Telugu
పవన్‌తో మరోసారి ప్రకాశ్ రాజ్?
Updated : Jun 28, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరు జట్టుకట్టిన `సుస్వాగతం` (1998), `బద్రి` (2000), `జల్సా` (2008), `వకీల్ సాబ్` (2021) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్ - స్టార్ కెప్టెన్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ చిత్రంలో ఓ శక్తిమంతమైన పాత్ర ఉందట. అందులో ప్రకాశ్ రాజ్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. హరీశ్ శంకర్ కాంబినేషన్ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `హరిహర వీరమల్లు` చిత్రాలతో పలకరించబోతున్నారు. 2022లో ఈ రెండు సినిమాలు కూడా సందడి చేయనున్నాయి.