English | Telugu

బిగ్ బాస్-5 హోస్ట్ గా రానా!!

బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు బిగ్ బాస్ షో సిద్ధమవుతోంది. తెలుగు బిగ్ బాస్ ఐదవ సీజన్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఆ తరువాత రెండవ సీజన్ తో నాని, మూడు, నాల్గవ సీజన్లతో నాగార్జున ఆకట్టుకున్నారు. సీజన్ 5 కు కూడా నాగార్జున హోస్ట్ చేసే అవకాశం ఉందని భావించారంతా. అయితే తాజాగా సీజన్ 5 కు హోస్ట్ మారబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 5 కు హోస్ట్ గా రానా దగ్గుబాటి హోస్టింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు.. కొన్ని ఇతర కారణాల వల్ల నాగార్జున ఈ సీజన్ కు హోస్టింగ్ చేయలేనని నిర్వాహకులతో చెప్పాడట. దాంతో నిర్వాహకుల రానాను సంప్రదించారట. రానాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో పాటు హోస్టుగానూ అనుభవం ఉంది. నెం 1 యారీ షోతో రానా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అందుకే రానా అయితే బిగ్ బాస్ ను బాగా లీడ్ చేస్తాడని నిర్వాహకులు నమ్మారని.. అంతేకాదు రానాకు భారీ మొత్తమే ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

గత సీజన్ కంటే ఈ సీజన్ ను మరింత విభిన్నంగా ఆకట్టుకునే విధంగా రూపొందించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. మరి నెం 1 యారీ షోతో ఆకట్టుకున్న రానా.. బిగ్ బాస్ షోని ఎలా నడిపిస్తాడో చూడాలి.