English | Telugu
బాలయ్య సినిమా కాపీనా??
Updated : Mar 13, 2017
బాలకృష్ణ 101వ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చిరంజీవి కోసం రాసుకొన్న ఆటోజానీ కథనే బాలయ్య కోసం మార్చి.. సినిమాగా తీస్తున్నాడని మొన్నటి వరకూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కొత్త కథ వినిపిస్తోంది. హాలీవుడ్ సినిమా జాన్ విక్ కి ఇది కాపీ అని... బాలయ్య కథ.. జాన్ విక్ కథ రెండూ ఒక్కటే అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. జాన్ విక్‌లో హీరో ఓ గ్యాంగ్ స్టర్.
తన భార్య చనిపోవడంతో ఆ వృత్తిని వదిలేసి ప్రశాంతంగా గడుపుతుంటాడు. అయితే.. భార్య జ్ఞాపకంగా దాచుకొన్న ఓ కారు కోసం గొడవ మొదలువుతుంది. దాంతో.. హీరో మళ్లీ గ్యాంగ్ స్టర్‌గా మారాల్సివస్తుంది. జగపతిబాబు నటించిన గాయం 2 కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అయితే.. బాలయ్య శైలికి, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ కథని మార్చాడట పూరి. మరి అదెంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలియాలంటే... బాలయ్య సినిమా బయటకు రావాల్సిందే.