English | Telugu

రాజకీయ నాయకులకు రెండవ బ్రోకర్

 

ఆర్ పి పట్నాయక్ దర్శకత్వంలో "బ్రోకర్" అనే చిత్రం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ "బ్రోకర్ 2" తెరకెక్కుతుంది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర మరో పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ పోస్టర్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల గుర్తులను పెట్టారు. వీటి కింద చిత్ర టైటిల్ ను పెట్టారు. అసలే రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో ఈ పోస్టర్ విడుదల చేయడం వలన ప్రజల్లో ఎదో చైతన్యం వస్తుందనే ఆలోచనలో ఈ చిత్ర యూనిట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఈ పోస్టర్లో "ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజాస్వామ్యం ?!" అనే మాటలను చూడవచ్చు. వెంకట్ వర్దినేని సమర్పణలో డైరెక్టర్స్ సినిమా బ్యానర్లో మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సమాజంలో మనం ప్రతిరోజు ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలనీ భావిస్తున్నారు.